ఆ స్టార్ హీరో పూజా హెగ్డే కోరిక తీర్చాడట!

Jul 30 2021 @ 19:52PM

టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా ఉన్న నటి పూజా హెగ్డే ఇప్పుడు కోలీవుడ్‌కు పరిచయమవుతోంది. అగ్ర హీరో విజయ్‌ నటిస్తున్న ‘బీస్ట్‌’ చిత్రం ద్వారా కోలీవుడ్‌లో అడుగుపెడుతోంది. సన్‌ పిక్చర్స్‌ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం సమకూర్చుతున్నారు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకుడు కాగా, కళానిధి మారన్‌ నిర్మాత. ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను ఈజిప్టులో పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చెన్నైలో రెండో షెడ్యూల్‌ శరవేగంగా సాగుతోంది. ఈ షెడ్యూల్‌లో ఒక పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. 


ఈ రెండో షెడ్యూల్‌ కూడా ముగియనున్న నేపథ్యంలో మూడో షెడ్యూల్‌ ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది. చెన్నై ఎయిర్‌పోర్టుకు సమీపంలో మూడు రోజుల పాటు ఈ షూటింగ్‌ జరిపేలా ప్లాన్‌ చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో చిత్ర హీరో విజయ్‌పై ప్రశంసలు కురిపిస్తూ హీరోయిన్‌ పూజా హెగ్డే ఓ వీడియోలో మాట్లాడింది. ఇందులో... ‘సుధీర్ఘకాలంగా తమిళ చిత్రాల్లో నటించాలని భావిస్తూ వచ్చాను. ఈ కోరిక విజయ్‌ ద్వారా నెరవేరింది. ఆయన ఎంతో ప్రతిభావంతుడైన హీరో మాత్రమే కాదు ఓ మంచి మానవతావాది’ అంటూ పూజా హెగ్డే ప్రశంసల వర్షం కురిపించింది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.