పూజా హెగ్డే గుండె పగిలింది!

Apr 22 2021 @ 20:33PM

తనకెంతో ఇష్టమైన టీచర్‌ మరణవార్త గుండె పగిలేలా చేసిందని పూజా హెగ్డే ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు చదువు చెప్పిన శ్రీమతి జెసికా దరువాలా ఇక లేరనే వార్తను నమ్మలేకపోతున్నానని పూజా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపారు. ఈ బాధను తట్టుకోలేకపోతున్నానని తన బాధను వ్యక్తం చేశారు. ఢిల్లీలోని మానెక్‌జీ కూపర్‌ స్కూల్‌లో చదివి ఉంటే ఇతరులకు  కూడా ఆ టీచర్‌ గొప్పతనం తెలిసేదని పేర్కొన్నారు. ‘‘ఈ ప్రపంచం ఓ రత్నాన్ని కోల్పోయింది. నేను నిరాశ చెందిన ప్రతిసారీ ఆమె ఎంతో ధైర్యం చెప్పి చైతన్య పరిచేవారు. కొంతమంది టీచర్లు బంగారం లాంటివారు. జెసికా మేడమ్‌ జియోగ్రఫీ టీచర్‌ అయినా ఎన్నో జీవిత పాఠాలను నేర్పించారు. అలాంటి ఓ టీచర్‌ని మిస్‌ కావడం ఎంతో బాధగా ఉంది. నా ఉన్నతికి కారణమైన జెసికా గారిని ఎప్పటికీ మరిచిపోలేను’’ అని పూజా హెగ్డే తన సంతాపం తెలిపారు. 

 


Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.