Advertisement

విజయ్ సినిమాలో పూజ?

Jan 21 2021 @ 08:57AM

తెలుగు, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది హీరోయిన్ పూజా హెగ్డే. తాజాగా తమిళంపై కూడా పూజ దృష్టి సారించిందట. నిజానికి తమిళ సినిమా `ముగముది`తోనే పూజ నటిగా పరిచయమైంది. ఆ తర్వాత కోలీవుడ్‌కు దూరమైంది. 


ఇన్నాళ్లకు పూజకు మళ్లీ కోలీవుడ్ నుంచి పిలుపు వచ్చిందట. `మాస్టర్` తర్వాత తమిళ స్టార్ హీరో విజయ్ చేస్తున్న సినిమాలో నటించే ఛాన్స్ పూజను వరించిందట. ఇప్పటికే పూజతో దర్శకుడు నెల్సన్ సంప్రదింపులు జరుపుతున్నాడట. మరి, ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.