Advertisement

`రాధేశ్యామ్` పూర్తి చేసిన పూజ!

Jan 17 2021 @ 13:26PM

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులోనే కాదు బాలీవుడ్ నుంచి కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ సరసన `రాధేశ్యామ్` సినిమాలో నటిస్తోంది. `జిల్` ఫేమ్ రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. 


హైదరాబాద్‌లో `రాధేశ్యామ్` కోసం  ఓ భారీ సెట్ వేశారు. ఆ సెట్‌లో 30 రోజుల పాటు సుదీర్ఘంగా షూటింగ్ జరిపారు. ఆ షెడ్యూల్ షూటింగ్ పూర్తయినట్టు పూజ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లిపోతున్నట్టు పేర్కొంది. `రాధేశ్యామ్` లాంగ్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయిందని, షూటింగ్ స్పాట్ నుంచి ఇంటికి వెళుతున్నానని పూజ తెలిపింది. 

 


Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.