MAA Elections: ఓటు వేశాక పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-10-10T19:01:44+05:30 IST

ఈ క్రమంలో నటి పూనమ్ కౌర్ కూడా మా ఎన్నికల్లో ఓటు వేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

MAA Elections: ఓటు వేశాక పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ రసవత్తరంగా సాగుతున్నాయి. అగ్ర నటులతో పాటు నవతరం నటీనటులు కూడా ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో నటి పూనమ్ కౌర్ కూడా మా ఎన్నికల్లో ఓటు వేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజకీయ లబ్ధి కోసం నటీనటులను వాడుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ గెలిచినా, మంచు విష్ణు గెలిచినా ఈ విషయంపై దృష్టి పెట్టాలి. రాజకీయాల కోసం ఆర్టిస్టులను సతాయించడం మానేయాలి అని కోరుతున్నా.’’ అని పూనమ్ కౌర్ పేర్కొన్నారు.

Updated Date - 2021-10-10T19:01:44+05:30 IST