పేదవాడి ప్లాట్లా... చిన్న చెరువులా...?

ABN , First Publish Date - 2020-11-30T04:15:09+05:30 IST

సింగరాయకొండ పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలు వర్షానికి చెరువులను తలపిస్తున్నాయి.

పేదవాడి ప్లాట్లా... చిన్న చెరువులా...?
పాకలలో పేదలకు పంచే ఇళ్ల స్థలాలు ఇందులోనే


సింగరాయకొండ, నవంబరు 29 : పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలు వర్షానికి చెరువులను తలపిస్తున్నాయి. లబ్ధిదారులు ఈ ఇళ్ల స్ధలాలను చూసి ఇవి ప్లాట్లా లేక చిన్నపాటి చెరువులా అని చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే... మండలంలో పాకల గ్రామంలో పేదలకు ప్రభుత్వం కేటాయించిన స్థలాలల్లో భారీగా వర్షపు నీరు చేరింది. ఈ స్థలాల్లో గతంలో సాల్ట్‌ సొసైటి కింద 280 ఎకరాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఉప్పు పంటను సాగుచేసుకొనేవారు. ఇందులో పోతయ్యగారి పట్టపుపాలెం, పాకల పల్లెకారులకు 432 ప్లాట్లను ప్రభుత్వం వేసింది. ఈ భూమిలో ఎక్కడా కూడా నీటి వసతిలేదు. ఈ స్థలాలు గ్రామానికి చాలా దూరంగా ఉంటాయి. నివాసానికి పనికిరాని స్థలాలను ప్రభుత్వం కేటాయించిందని లబ్ధిదారులు విమర్శిస్తున్నారు. ఈ ప్లాట్లలను ఎక్కువగా ఎస్సీ, ఎస్టీలకు కేటాయించడం విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వాటికి బదులు నివాసయోగ్యవైన స్థలాలను కేటాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

Updated Date - 2020-11-30T04:15:09+05:30 IST