Advertisement

పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం: జడ్పీ చైర్మన్‌ కమల్‌రాజ్‌

Jan 23 2021 @ 23:18PM
పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పుతున్న జడ్పీచైర్మన్‌

బోనకల్‌, జనవరి 23: పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ చిత్తశుద్దితో పనిచేస్తున్నారని జడ్పీచైర్మన్‌ కమలరాజు తెలిపారు. మండలంలోని ఆళ్లపాడులో శనివారం రాత్రి పలు పార్టీల నుంచి 25కుటుంబాల వారు ఆయన సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు. ట్రాక్టర్ల ర్యాలీలో ట్రాక్టర్‌ నడిపి అందరిని ఉత్సాహపరిచారు. సభలో జడ్పీ, డీసీసీబీ చైర్మన్లు కమలరాజు, కూరాకుల మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలను సంతృప్తిపర్చేవిధంగా ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ చిత్తారు నాగేశ్వరరావు, వైస్‌చైర్మన్‌ జంగా రవి, ఆత్మచైర్మన్‌ రంగిశెట్టి కోటేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు బంధం శ్రీనివాసరావు, చేబ్రోలు మల్లికార్జున్‌, నాయకులు గద్దల వెంకటేశ్వర్లు, పారా ప్రసాద్‌, బుంగా వెంకయ్య, తెల్లబోయిన నాగేశ్వరరావు, వలీ, బాణోతు కొండ, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.


Follow Us on:
Advertisement