పేదల బియ్యం పక్కదారి

ABN , First Publish Date - 2021-06-20T04:55:39+05:30 IST

పేదల బియ్యం పక్కదారి పడుతోం ది.

పేదల బియ్యం పక్కదారి
చిన్నమందడిలో పట్టుబడిన బియ్యం

- వేర్వేరు చోట్ల 124 క్వింటాళ్ల బియ్యం పట్టివేత


కల్వకుర్తి అర్బన్‌/నాగర్‌కర్నూల్‌ క్రైం/పెద్దమంద డి, జూన్‌ 19 : పేదల బియ్యం పక్కదారి పడుతోం ది. నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో శనివారం దా దాపు 124 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టుబడింది. 

- నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన సుజా త, ఆ ప్రాంతంలో 70 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని సేకరించింది. ఈ బియ్యాన్ని నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ మండలం సారంబండతండాకు చెందిన రమేశ్‌తో కలిసి కల్వకుర్తిలో విక్రయించేందుకు ప్లా న్‌ వేసింది. శనివారం లారీల్లో బియ్యాన్ని తీసుకొ స్తుండగా, తాండ్ర సమీపంలో ఎస్‌ఐ మహేదంర్‌ పట్టుకున్నారు. లారీ డ్రైవర్‌ దేవయ్యతో పాటు సు జాత, రమేశ్‌పై కేసు నమోదు చేశారు. లారీలో ఉ న్న 150 సంచుల బియ్యాన్నీ సీజ్‌ చేశారు. అలాగే నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో శివశంకర్‌, శివయ్యలు అక్రమంగా నిల్వ ఉంచిన 35 క్వింటాళ్ల బియ్యాన్ని అ ధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్సు టీమ్‌ ఎస్‌ఐ మా నిక్‌నాయక్‌, ఎస్‌ఐ విజయ్‌కుమార్‌, ఏఎస్‌ఐ ఆచారి, సిబ్బంది ప్రవీణ్‌కుమార్‌, గుణ శేఖర్‌, సురేందర్‌ పాల్గొన్నారు.

- వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిన్నమందడి గ్రామానికి చెందిన తోకల మధు గ్రామంలో దాదాపు 19 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని సేకరించాడు. శుక్రవారం అర్ధరాత్రి టాటా ఏస్‌ ఆటోలో ఈ బియ్యాన్ని తరలిస్తుండగా, పోలీసులు పట్టుకున్నా రు. వాహనాన్ని స్వాధీనం చేసుకొని, సివిల్‌ సఫ్లై అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ వేణుగోపాల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు.

Updated Date - 2021-06-20T04:55:39+05:30 IST