పడకేసిన పారిశుధ్యం

ABN , First Publish Date - 2022-08-09T05:15:31+05:30 IST

గ్రామాలలో పారిశుధ్యం పడకేసింది. రెండునెలల క్రితం అక్కడక్కడ సై డ్‌ డ్రైన్‌లు పూడికతీత చేపట్టినా ఇటీవల కురిసి న వర్షాలకు మరలా యఽథాతధ స్థితికి చేరాయి.

పడకేసిన పారిశుధ్యం
వి.కొప్పెరపాడులో రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగు నీరు

గ్రామాల్లో ప్రబలుతున్న సీజనల్‌ వ్యాధులు

పట్టించుకోని అధికారులు

ఆందోళన చెందుతున్న ప్రజలు

అద్దంకి, ఆగస్టు 8: గ్రామాలలో పారిశుధ్యం పడకేసింది. రెండునెలల  క్రితం అక్కడక్కడ సై డ్‌ డ్రైన్‌లు పూడికతీత చేపట్టినా ఇటీవల కురిసి న వర్షాలకు మరలా యఽథాతధ స్థితికి చేరాయి. అ ద్దంకి నియోజకవర్గంలో 103 గ్రామపంచాయతీలు ఉండగా, కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల, రావినూతల, పమిడిపాడులు మాత్రమే మేజర్‌ పం చాయతీలు. మిగిలినవన్నీ మైనర్‌ గ్రామ పంచాయ తీలే. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామాలలో సీజన ల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఏ ఒక్క గ్రామ పం చాయతీలో కూడా కనీసం బ్లీచింగ్‌ చల్లిన పాపాన పోలేదు. దోమల నివారణకు ఎబేట్‌, మలాధియాన్‌ ద్రావణాలు పిచికారి అసలే లేదు. అత్యధిక గ్రామ పంచాయతీలలో నిధులు అందుబాటులో లేకపోవ టంతో పారిశుధ్యం, దోమల నివారణపై దృష్టి పెట్టే అవకాశం లేకుండా పోయిందని పలువురు సర్పంచ్‌ లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అత్యధిక గ్రామాలలో మురుగు కాల్వలు పూడి పోవటంతో మురుగు నీరు మొత్తం రోడ్లపైనే ప్రవహిస్తున్నాయి. సీజనల్‌ వ్యాధులు,  దోమల బెడద మరింత పెరిగే అవకాశం ఉండటంతో వ్యాధులు మరింత పెరిగే అ వకాశం ఉందని ప్రజలు ఆందోళ న చెందుతున్నారు.


అస్తవ్యస్తంగా పారిశుధ్యం

పర్చూరు, ఆగస్టు 8: గ్రామాల్లో పారిఽశుధ్యం అస్త వ్యస్తంగా ఉంది. ఎక్కడ చూసినా మురుగునీరే దర్శ నమిస్తున్నాయి. దీంతో దోమల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. దోమల నివారణ చర్యలుగా మురు గు కాలువల్లో బైటెక్స్‌, ఎబేట్‌, మలాధిన్‌ వంటి ద్రావ ణాలు పిచికారి చేయాల్సి ఉన్నా పట్టించుకునే నాథు డే కరువయ్యారు. ప్రస్తుతం వర్షాకాలం కావటంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలుతాయని ప్రజలు ఆందో ళన చెందుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో జ్వరపీడి తుల సంఖ్య పెరిగిపోవటంతో ఎలాంటి ప్రాణాంత కర వ్యాధులు వ్యాపిస్తాయోనని ప్రజలు భయాందో ళన చెందుతున్నారు. గతంలో పారిశుధ్యం ప్రబలి ప ర్చూరులోని అంబేడ్కర్‌నగర్‌, ఇందిరాకాలనీ, నెహ్రూ నగర్‌లో డెంగ్యూ, చికున్‌ గున్యా బారినపడి ప్రాణా లు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు దృష్టిసారించి మురుగు నీరు నిల్వ ఉ న్న ప్రాంతాల్లో ద్రావణాలను పిచికారి చేయటంతో పాటు, దోమల నివారణకు ఫాగింగ్‌ చర్యలు చేపట్టా లని ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2022-08-09T05:15:31+05:30 IST