పూర్ణాహుతి చేస్తున్న అర్చకులు, వేదపండితులు, ఈవో
నేడు అశ్వవాహనసేవ, పుష్పోత్సవం
శ్రీశైలం, జనవరి 17: శ్రీశైలంలో ఈ నెల 12న ప్రారంభమైన సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు సోమవారం పూర్ణాహుతి నిర్వహించారు. నారికేళాలు, పలు సుగంధద్రవ్యాలు, నూతన వస్త్రాలు హోమగుండానికి సమర్పించారు. చండీశ్వరస్వామికి పుష్కరిణిలో అవబృథస్నానం చేయించారు. ఉత్సవాల మొదటిరోజున ప్రారంభ సూచికంగా ఆలయ ధ్వజస్తంభంపై ఆవిష్కరించిన పట్టాన్ని అవరోహణ చేశారు. మంగళవారం ఉదయం స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం అశ్వవాహనసేవ, ఆలయ ఉత్సవం జరుపుతారు. అనంతరం స్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవం, ఏకాంతసేవ, శయనోత్సవం నిర్వహిస్తారు.