Nitish Tejashwi Tie-up: నితీశ్-తేజస్వీ మధ్య పొత్తు ఇలా కుదిరిందట!

ABN , First Publish Date - 2022-08-13T00:05:40+05:30 IST

పాట్నా: జేడియూ అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌‌(Nitish Kumar)కు, ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్‌(Tejashwi yadav)‌కు మధ్య పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (Popular Front of India) అనే సంస్థ పొత్తు కుదిర్చిందని బీజేపీ ఆరోపించింది.

Nitish Tejashwi Tie-up: నితీశ్-తేజస్వీ మధ్య పొత్తు ఇలా కుదిరిందట!

పాట్నా: జేడియూ అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌‌(Nitish Kumar)కు, ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్‌(Tejashwi yadav)‌కు మధ్య పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (Popular Front of India) అనే సంస్థ పొత్తు కుదిర్చిందని బీజేపీ ఆరోపించింది. ఉగ్రవాద మూకలతో కలిసి భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నందుకు పీఎఫ్‌ఐ(PFI) సంస్థకు చెందిన ఇద్దరిని పాట్నాలో అరెస్ట్ చేసి ఎన్‌ఐఏ(NIA)కు అప్పగించినప్పటి నుంచీ రగడ మొదలైందని బీహార్ బీజేపీ చీఫ్ సంజయ్ జైస్వాల్(Bihar BJP chief Sanjay Jaiswal) ఆరోపించారు. ఓ వర్గం ఓట్ల కోసం జేడియూ, ఆర్జేడీ సంతుష్టీకరణ రాజకీయాలకు పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు. 


వాస్తవానికి రంజాన్ సమయంలో మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసంలో జరిగిన ఇఫ్తార్ విందు సమావేశంలో జేడియూ, ఆర్జేడీ మధ్య చర్చలు మొదలై చివరకు పొత్తుకు దారితీశాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. మూడు నెలలుగా జేడియూ, ఆర్జేడీ నేతల మధ్య పొత్తులు, అధికార పంపిణీపై చర్చలు జరుగుతున్నాయని కమలనాథులు ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడియూకు తమ కన్నా తక్కువ సీట్లు వచ్చినా నితీశ్‌ను ముఖ్యమంత్రిని చేస్తే తమకు వెన్నుపోటు పొడిచారని, దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తామని బీజేపీ నేతలంటున్నారు.                





మరోవైపు ఈ నెల 24న నితీశ్ బల నిరూపణ చేసుకోనున్నారు. అమొత్తం ఏడు పార్టీలకు చెందిన 164 మంది ఎమ్మెల్యేలు  మద్దతిస్తున్నట్లు గవర్నర్ ఫాగు చౌహాన్‌కు ఇచ్చిన లేఖలో నితీశ్ తెలిపారు. జేడియా-ఆర్జేడీ-కాంగ్రెస్- సీపీఐ ఎంఎల్ ఇతర పార్టీల మద్దతుతో నితీశ్ ప్రభుత్వం ఈ నెల 10న కొలువు తీరింది. నితీశ్ ముఖ్యమంత్రిగా, తేజస్వీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈ నెల 24 తర్వాత మంత్రివర్గ విస్తరణ జరగనుంది.  



Updated Date - 2022-08-13T00:05:40+05:30 IST