ఆ ద్వీపంలోని 10% మందికి రంగులు కనిపించవు.. కారణమిదే..

ABN , First Publish Date - 2022-05-29T17:37:00+05:30 IST

1775వ సంవత్సరంలో పసిఫిక్ మహాసముద్రంలోని...

ఆ ద్వీపంలోని 10% మందికి రంగులు కనిపించవు.. కారణమిదే..

1775వ సంవత్సరంలో పసిఫిక్ మహాసముద్రంలోని పింగెలాప్ ద్వీపంలో తుఫాను వచ్చింది. ఈ భయంకరమైన తుఫాను తాకిడి అనంతరం అక్కడ కేవలం 20 మంది మాత్రమే మిగిలారు. వారిలో ఒకరు అక్కడి రాజు అని తెలుస్తోంది. వందల సంవత్సరాల తరువాత ఈ ప్రాంతంలోని జనాభాలో కొందరికి వర్ణాంధత్వం వచ్చింది. వర్ణాంధత్వం అంటే ఇది సోకిన బాధితులకు రంగులు కనిపించవు లేదా కొన్ని రంగులు చూడడంలో ఇబ్బంది ఎదురవుతుంది. 


నేషనల్ ఐ ఇన్‌స్టిట్యూట్ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర యూరోపియన్ పూర్వీకులలో 8 శాతం మంది పురుషులు, 0.5 శాతం మంది మహిళలు ఆకుపచ్చ, ఎరుపు రంగు అంధత్వం కలిగి ఉన్నారు.  పింగెలాప్ ద్వీపంలోని జనాభాలో దాదాపు 10 శాతం మంది అరుదైన పరిస్థితితో బాధపడుతున్నారు. ఈ వైద్య పరిస్థితిని కంప్లీట్ అక్రోమాటోప్సియా లేదా టోటల్ కలర్ బ్లైండ్‌నెస్ అంటారు. దీని బారినపడినవారు ఏ రంగునూ చూడలేరు. రంగులను గ్రహించే కోన్ కోన్‌లు లేకపోవడం వల్ల వారు నలుపు, తెలుపు, బూడిద రంగులను మాత్రమే చూడగలుగుతారు. ద్వీపంలో కొద్దిమందికి మాత్రమే సంతానోత్పత్తి సామర్థ్యం ఉందని తెలిసింది. 

Updated Date - 2022-05-29T17:37:00+05:30 IST