అమెరికా కాలేజీలో పోర్నోగ్రఫీలో కోర్సు.. విద్యార్థులందరూ కలసికట్టుగా ఆ సినిమాలు చూసి..

ABN , First Publish Date - 2022-04-24T00:59:26+05:30 IST

అమెరికాలోని వెస్ట్‌మిన్స్టర్ కాలేజీ తన విద్యార్థులకు పోర్నోగ్రఫీలో ఓ కోర్సు అందిస్తోంది. ఈ రంగంలో జాతి, వర్గ, లింగ ఆధారిత వ్యత్యాసాలను సెక్సూవలైజేషన్ చేస్తూ ఎలా లాభాలు ఆర్జిస్తున్నారనే విషయంలో అధ్యయనం చేయడమే పోర్నోగ్రఫీ కోర్సు ప్రధాన ఉద్దేశ్యం.

అమెరికా కాలేజీలో పోర్నోగ్రఫీలో కోర్సు.. విద్యార్థులందరూ కలసికట్టుగా ఆ సినిమాలు చూసి..

ఎన్నారై డెస్క్: అమెరికాలోని వెస్ట్‌మిన్స్టర్ కాలేజీ తన విద్యార్థులకు పోర్నోగ్రఫీలో ఓ కోర్సు అందిస్తోంది. ఈ రంగంలో జాతి, వర్గ, లింగ ఆధారిత వ్యత్యాసాలను సెక్సూవలైజేషన్ చేస్తూ ఎలా లాభాలు ఆర్జిస్తున్నారనే విషయంలో అధ్యయనం చేయడమే పోర్నోగ్రఫీ కోర్సు ప్రధాన ఉద్దేశ్యం. ఈ క్రమంలో విద్యార్థులు కలిసిగట్టుగా పోర్న్ సినిమాలు చూసి.. ఈ రంగంలోని మార్పులుపై కూలంకషమైన చర్చలు చేపట్టాలి. తదనంతరం.. ఓ అంచనాకు రావాలి. అయితే..ఈ కోర్సును ఎంచుకోవాలో వద్దో  విద్యార్థులే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కోర్సులో భాగంగా విద్యార్థులు హార్డ్‌కోర్ పోర్నోగ్రఫీ కూడా విక్షించాల్సి ఉంటుందని సమాచారం. 

Updated Date - 2022-04-24T00:59:26+05:30 IST