గూగుల్‌లో సంస్కృత భాషకు స్థానం

ABN , First Publish Date - 2022-05-22T06:43:44+05:30 IST

గూగుల్‌లో సంస్కృత భాషకు స్థానం కల్పించారని జాతీయ సంస్కృత వర్సిటీ ఇన్‌చార్జి వీసీ తెలిపారు.

గూగుల్‌లో సంస్కృత భాషకు స్థానం
శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న వీసీ రాధాకాంత ఠాగూర్‌

తిరుపతి(విద్య), మే 21: గూగుల్‌లో సంస్కృత భాషకు స్థానం కల్పించారని, దీన్ని భాషాభిమానులందరూ సద్వినియోగం చేసుకోవాలని తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీ ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్‌ రాధాకాంత ఠాగూర్‌ పిలుపునిచ్చారు. తిరుపతిలోని వర్సిటీలో శనివారం గూగుల్‌ క్రౌడ్‌ సోర్స్‌ అనే అంశంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. గూగుల్‌లోని క్రౌడ్‌సోర్స్‌ యాప్‌లో సంస్కృత భాషను ఇతరభాషల్లాగే టైపు చేసుకునే వెసులుబాటు కల్పించారని తెలిపారు.  గూగుల్‌ మేనేజర్‌ నిఖిల్‌ మధుసూదన్‌ మాట్లాడుతూ.. సంస్కృత భాష వికాసానికి తమ టీమ్‌ సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. ప్రొఫెసర్లు గణపతిభట్‌, వెంకటరావు, పీఆర్వో డాక్టర్‌ ఎస్‌.దక్షిణామూర్తిశర్మ, చారుకేశ్‌, కుమార్‌ భాగేవాడిమఠ్‌, శేఖర్‌రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T06:43:44+05:30 IST