నలుగురు విద్యార్థినులకు పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-04-16T04:45:47+05:30 IST

మండలంలోని ఓ పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. నలుగురు విద్యార్థినులకు పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ నెల 5న పాఠశాలలో కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. గురువారం ఫలితాలురాగా..నలుగురు విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

నలుగురు విద్యార్థినులకు పాజిటివ్‌
విద్యార్థులకు నిర్థారణ పరీక్షలు చేస్తున్న దృశ్యం




మరో 30 మందిలో వైరస్‌ లక్షణాలు

రామభద్రపురం, ఏప్రిల్‌ 15: మండలంలోని ఓ పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. నలుగురు విద్యార్థినులకు పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ నెల 5న పాఠశాలలో కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. గురువారం ఫలితాలురాగా..నలుగురు విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. హోమ్‌ ఐసోలేషన్‌కు పంపించారు. కరోనా కిట్లు అందించారు. అదే పాఠశాలలో 30 మంది విద్యార్థినులు వైరస్‌ లక్షణాలతో బాధపడుతున్నారు. గురువారం వారికి వైరస్‌ నిర్థారణ పరీక్షలు చేశారు. ఫలితాలు రావాల్సి ఉందని ఆరికతోట పీహెచ్‌సీ వైద్యాధికారి కృష్ణసాగర్‌ తెలిపారు. సకాలంలో పాఠశాల ప్రత్యేకాధికారి సమచారం ఇవ్వకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 




Updated Date - 2021-04-16T04:45:47+05:30 IST