Lakhimpur Kheri violence:రైతు మృతదేహానికి రీ పోస్టుమార్టం..సీఎం కార్యాలయం ఆదేశం

ABN , First Publish Date - 2021-10-06T14:14:00+05:30 IST

లఖింపూర్ ఖేరీ హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన రైతు గుర్విందర్ సింగ్‌కు బుధవారం రీ పోస్ట్‌మార్టం నిర్వహించాలని బహ్రెయిచ్ జిల్లా మెజిస్ట్రేట్ దినేష్ చంద్ర ఆదేశించారు....

Lakhimpur Kheri violence:రైతు మృతదేహానికి రీ పోస్టుమార్టం..సీఎం కార్యాలయం ఆదేశం

లఖింపూర్ ఖేరి (ఉత్తరప్రదేశ్): లఖింపూర్ ఖేరీ హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన రైతు గుర్విందర్ సింగ్‌కు బుధవారం రీ పోస్ట్‌మార్టం నిర్వహించాలని బహ్రెయిచ్ జిల్లా మెజిస్ట్రేట్ దినేష్ చంద్ర ఆదేశించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం ఆదేశాలకు అనుగుణంగా రైతు మృతదేహానికి రీ పోస్టుమార్టం చేస్తున్నామని మెజిస్ట్రేట్ చెప్పారు. వాస్తవానికి మంగళవారం రైతుల మృతదేహాలకు పోస్టుమార్టం చేశారు. మంగళవారం నిర్వహించిన పోస్టుమార్టంపై మృతుడి కుటుంబం సందేహాలు లేవనెత్తిన నేపథ్యంలో రీ పోస్టుమార్టం చేయాలని నిర్ణయించారు.ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల ప్రకారం రీ పోస్టుమార్టంను పర్యవేక్షించడానికి లక్నో నుంచి నిపుణుల బృందం వచ్చిందని జిల్లా మెజిస్ట్రేట్ చెప్పారు. 


గుర్విందర్ సింగ్‌ ను కాల్చి చంపినట్లు అతని కుటుంబీకులు నమ్మడంతో మళ్లీ పోస్టుమార్టం చేయాలని నిర్ణయించారు.రీ పోస్టుమార్టం అనంతరం శవానికి దహన సంస్కారాలు చేస్తామని మృతుడి కుటుంబసభ్యులు చెప్పారు. హింసాకాండలో మరణించిన వారి కుటుంబాలకు రూ.45లక్షల పరిహారంతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. లఖింపూర్ ఖేరీ ఘటనపై యూపీ సర్కారు రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తితో న్యాయవిచారణ జరిపించాలని నిర్ణయించింది.   

Updated Date - 2021-10-06T14:14:00+05:30 IST