తపాలాశాఖ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2022-08-11T04:38:00+05:30 IST

తపాలా శాఖ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ పోస్టల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (ఎన్‌ఎస్‌ఎఫ్‌పీ) రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి శ్రావణి డిమాండ్‌ చేశారు.

తపాలాశాఖ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి
మంచిర్యాలలో ధర్నా నిర్వహిస్తున్న పోస్టల్‌ శాఖ ఉద్యోగులు

 -  ఎన్‌ఎస్‌ఎఫ్‌పీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌  కార్యదర్శి శ్రావణి  

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు  10 : తపాలా శాఖ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ పోస్టల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (ఎన్‌ఎస్‌ఎఫ్‌పీ) రాష్ట్ర ఆర్గనైజింగ్‌  కార్యదర్శి శ్రావణి డిమాండ్‌ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో గల హెడ్‌ పోస్టు ఆఫీస్‌ ఎదుట  ఉద్యోగులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తపాలా  శాఖను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే విధంగా కుట్ర పన్నుతుందని చెప్పారు. ఏండ్ల తరబడి అనేక సేవలందిస్తున్న  సంస్థను ప్రైవేటీకరించడం తగదన్నారు. సీఐటీయూ, ఉద్యోగుల సంఘం నాయకులు పోస్టల్‌ శాఖ ధర్నాకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు రాందాస్‌, రాజేషం మాట్లాడారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎఫ్‌పీ జిల్లా అద్యక్షుడు వెంకటస్వామి, బ్రాంచి సెక్రెటరీ వివేక్‌, సుధీర్‌, రమేష్‌, సుప్రియరెడ్డి, శ్రీవాణి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T04:38:00+05:30 IST