పాజిటివ్‌ వచ్చిన వారికి పోస్టల్‌ బ్యాలెట్‌

ABN , First Publish Date - 2021-04-24T05:13:24+05:30 IST

ఏప్రిల్‌ 15 అనంతరం కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు మునిసిపల్‌ కమిషనర్‌ ఆర్‌.వెంకటగోపాల్‌ తెలిపారు.

పాజిటివ్‌ వచ్చిన వారికి పోస్టల్‌ బ్యాలెట్‌

 మునిసిపల్‌ కమిషనర్‌ ఆర్‌.వెంకటగోపాల్‌ 


గజ్వేల్‌, ఏప్రిల్‌ 23: ఏప్రిల్‌ 15 అనంతరం కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు మునిసిపల్‌ కమిషనర్‌ ఆర్‌.వెంకటగోపాల్‌ తెలిపారు. గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని 12వ వార్డు ఉప ఎన్నిక సందర్భంగా గజ్వేల్‌ పట్టణంలోని ఐఓసీ ఏ బ్లాక్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు, అంగవైకల్యం ఉన్న వారికి కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. ఈ నెల 28లోగా వారందరూ చిరునామా ధ్రువీకరణకై శారీరక అంగవైకల్యం సర్టిఫికెట్‌, కొవిడ్‌ పాజిటివ్‌ రిపోర్టు, ఓటరు ఐడీ కార్డుతో ఐఓసీలోని ఏ బ్లాక్‌లో నేరుగా గానీ, లేదా పోస్టు ద్వారా గానీ సంప్రదించాలని సూచించారు. అనంతరం ఎన్నికల అబ్జార్వర్‌ వేణుమాధవ్‌రెడ్డి, రాజమౌళితో కలసి డీఆర్‌సీ సెంటర్‌, స్ట్రాంగ్‌ రూమ్‌, కౌంటింగ్‌ సెంటర్‌లను పరిశీలించారు. 


 

Updated Date - 2021-04-24T05:13:24+05:30 IST