Advertisement

పోస్టల్‌ ఉద్యోగుల ధర్నా

Apr 23 2021 @ 21:48PM
ధర్నా చేస్తున్న పోస్టల్‌ ఉద్యోగులు

గూడూరురూరల్‌, ఏప్రిల్‌ 23: తమ సమస్యలను పరిష్కరించాలని స్థానిక పోస్టాఫీసు వద్ద శుక్రవారం పోస్టల్‌ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో  ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ గతేడాది కొవిడ్‌ బారినపడి దేశ వ్యాప్తంగా 231 మంది, రాష్ట్ర వ్యాప్తంగా 31 మంది పోస్టల్‌ ఉద్యోగులు మృతి చెందారన్నారు.  మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని కేంద్రప్రభుత్వం ప్రకటించినా ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. ప్రతి ఇంటికి తిరిగి ఉత్తరాలు, పార్శిల్‌ అందిస్తున్న పోస్ట్‌మెన్‌కు పీపీఈ కిట్లు ఇవ్వలేదన్నారు. పదోన్నతులు నిలిచిపోయాయన్నారు. పోస్టల్‌ శాఖ ప్రైవేటీకరణ యత్నాలు నిలిపివేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు సుధాకర్‌రాజు, గోవిందనాయక్‌, చంద్రశేఖర్‌, వరలక్ష్మి, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.