‘పోస్టు కార్డు ప్రచార కార్యక్రమం’

ABN , First Publish Date - 2021-12-05T05:15:30+05:30 IST

భారత ప్రభుత్వ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, తపాలా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 75 వసతంతాల ఆజాద్‌ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా 75 లక్షల పోస్టు కార్డు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కర్నూలు డివిజనల్‌ పోస్టట్‌ సూపరింటెండెంట్‌ కె.హరిక్రిష్ణప్రసాద్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

‘పోస్టు కార్డు ప్రచార కార్యక్రమం’

కర్నూలు(న్యూసిటీ), డిసెంబరు 4:  భారత ప్రభుత్వ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, తపాలా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 75 వసతంతాల ఆజాద్‌ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా 75 లక్షల పోస్టు కార్డు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కర్నూలు డివిజనల్‌ పోస్టట్‌ సూపరింటెండెంట్‌ కె.హరిక్రిష్ణప్రసాద్‌ శనివారం  ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, జూనియర్‌ కళాశాల, 4 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు పోస్టుకార్డు రాయడంతో  ప్రధాని మోదీని కలిసే అవకాశం కల్పిస్తోందని తెలిపారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో గుర్తింపు పొందిన వీరులు.. 2047 నాటికి నా భారతదేశం ఎలా ఉండాలి అనే అంశాలపై తెలుగు, ఇంగ్లీషు, హిందీతో పాటు భారత రాజ్యాంగంచే గుర్తించిన భాషల్లో పోస్టు కార్డులు రాయాలని తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పంపిన పోస్టు కార్డులలో 75 కార్డులను జనవరి 17న ఢిల్లీలో జరిగే ఫొటో ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేస్తారన్నారు. ఎంపిక చేసిన విద్యార్థులతో ప్రధాని మోడీ ముఖాముఖి మాట్లాడతారన్నారు. అంతే కాకుండా అమృత మహోత్సవం సందర్భంగా దేశభక్తి గీతం, గేయాలు, రంగవళ్లులు వేసి తీర్చిదిద్దిన ఫొటోలను అమృతమహోత్సవ్‌.నిక్‌.ఇన్‌ అనే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  

Updated Date - 2021-12-05T05:15:30+05:30 IST