ఉపాధి పనులను వాయిదా వేయండి

ABN , First Publish Date - 2021-05-11T05:15:12+05:30 IST

ఉపాధి పనులను వాయిదా వేయండి

ఉపాధి పనులను వాయిదా వేయండి

ఇబ్రహీంపట్నం: కరోనా తీవ్రత దృష్ట్యా ఉపాధి హామీ పనులను 15 రోజులు వాయిదా వేయాలని జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి కలెక్టర్‌, డీఆర్‌డీఏ అధికారులకు సోమవారం వినతిపత్రమందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పని ప్రదేశాలకు ఆటోలు, ట్రాక్టర్లలో కలిసి వస్తున్నందున ఒకరినొకరికి కరోనా వ్యాప్తి చెందే ప్రమాదముందని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ఇప్పటికే గ్రామాల్లో కరోనా బాధితుల సంఖ్య తీవ్రంగా ఉన్న విషయాన్ని ఆయన గర్తు చేశారు.

Updated Date - 2021-05-11T05:15:12+05:30 IST