చిత్తూరు: పదవ తరగతి ప్రశ్నా పత్రాల మాల్ ప్రాక్టీస్ కేసు వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ (Narayana) బెయిల్ రద్దు పిటిషన్పై విచారణను చిత్తూరు 9వ అదనపు జిల్లా కోర్టు వాయిదా వేసింది. నారాయణ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 12న జిల్లా కోర్టులో చిత్తూరు పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా పోలీస్ శాఖ తరపున హైకోర్టు ఏజీపీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. దీంతో నారాయణ బెయిల్ రద్దు పిటిషన్ దాఖలుపై విచారణను కోర్టు ఈనెల 24కు వాయిదా వేసింది. తిరిగి ఈ రోజు మళ్ళీ న్యాయస్థానం కేసు విచారణను 30కి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి