పౌర హక్కులపై అవగాహన కల్పిస్తున్న అధికారులు
దగదర్తి, జూన్ 30: మండలంలోని చెన్నూరు పంచాయతీ కట్టుబడిపాళెం గిరిజనకాలనీలో గురువారం మండలాధికారులు పౌరహక్కులపై అవగాహన నిర్వహించారు. రాజ్యాంగంలో పౌరులకు కల్పించిన హక్కులు, వాటి వినియోగంపై ఎంపీడీవో శ్రీదేవి, తహసీల్దార్ ప్రమీల స్థానికులకు వివరించారు. చట్టాలను గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, తద్వారా తమ హక్కులను కాపాడుకోవాలని వారికి వివరించారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ సుధ, ఏఎస్‌ఐ జకీర్ తదితరులు పాల్గొన్నారు.