పొటాటో ఫింగర్స్
ABN , First Publish Date - 2020-10-06T20:26:54+05:30 IST
పొడుగ్గా ఉండే ఆలు - 2, నూనె - వేగించడానికి, కారం, ఉప్పు - చల్లడానికి సరిపడా.
కావలసిన పదార్థాలు: పొడుగ్గా ఉండే ఆలు - 2, నూనె - వేగించడానికి, కారం, ఉప్పు - చల్లడానికి సరిపడా.
తయారుచేసే విధానం: ఆలూ పొట్టు తీసి పొడుగ్గా కట్ చేసి చల్లనీటిలో 30 నిమిషాలుంచాలి. వడకట్టి, తుడిచిన తర్వాత మీడియం వేడి నూనెలో వేగించి పక్కనుంచాలి. మరోసారి తక్కువ వేడి నూనెలో వేగించి తీయాలి. వేడిగా ఉన్నప్పుడే పైన కారం, ఉప్పు రుచికి తగినంత చల్లాలి.