‘రాతి శిల్పాలకు ఆళ్లగడ్డ ప్రసిద్ధి’

ABN , First Publish Date - 2021-10-27T05:31:44+05:30 IST

రాతి శిల్పాలకు ఆళ్లగడ్డ ప్రసిద్ధి అని శిల్పాల అధ్యయన కమిటీ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధ కర్రివేణుమాధవ్‌, వినుకొండ వెంకటసుబ్బారావు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వరలక్ష్మి, గురువాచారి అన్నారు.

‘రాతి శిల్పాలకు ఆళ్లగడ్డ ప్రసిద్ధి’

ఆళ్లగడ్డ్డ, అక్టోబరు 26: రాతి శిల్పాలకు ఆళ్లగడ్డ ప్రసిద్ధి అని శిల్పాల అధ్యయన కమిటీ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధ కర్రివేణుమాధవ్‌, వినుకొండ వెంకటసుబ్బారావు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వరలక్ష్మి, గురువాచారి అన్నారు. పట్టణంలోని విశ్వరూప కాలనీలో వెలసిన కాళీకామాతకు మంగళవారం వారు పూజలు చేశారు. అనంతరం పట్టణంలోని నంద్యాల రోడ్డులో తయారు చేస్తున్న శిల్పాలను వారు పరిశీలించారు. రాష్ట్రంలో కొయ్య బొమ్మల తయారీకి కొండపల్లి, వీణల తయారీకి బొబ్బిలి, ఇత్తడి పనికి బుడితి, లక్కబొమ్మలకు ఏటికొప్పాకుల, ఆళ్లగడ్డ రాతి శిల్పాలకు ప్రసిద్ధి కెక్కాయన్నారు. రాతి శిల్పాల తయారీతో అనేక మంది శిల్పులు ఉపాధి పొందుతున్నారన్నారు. వీరి వెంట విజయ్‌కుమార్‌, శ్రీనివాసులు, గోపాలాచారి, ఆంజనేయులు, రవికుమార్‌, రామాచారి ఉన్నారు.



Updated Date - 2021-10-27T05:31:44+05:30 IST