AP News: పోతిన మహేష్ అరెస్టు విషయంలో ఒత్తిళ్లకు లొంగిన పోలీసులు

ABN , First Publish Date - 2022-09-03T13:26:50+05:30 IST

పోతిన మహేష్ అరెస్టు విషయంలో అధికారిక పార్టీ నేతల ఒత్తిళ్లకు పోలీసులు లొంగిపోయారు.

AP News: పోతిన మహేష్ అరెస్టు విషయంలో ఒత్తిళ్లకు లొంగిన పోలీసులు

విజయవాడ (Vijayawada): జనసేన నేత పోతిన మహేష్ (Potina Mahesh) అరెస్టు విషయంలో అధికారిక పార్టీ నేతల ఒత్తిళ్లకు పోలీసులు లొంగిపోయారు. జెండా దిమ్మె ధ్వంసం విషయంలో వైసీపీ (YCP), జనసేన (Janasena) కార్యకర్తలు మధ్య ఘర్షణ జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు పోతిన మహేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని భవానీపురం పోలీసు స్టేషన్‌కు తరలించారు. అర్ధరాత్రి వరకు ఉంచి శనివారం తెల్లవారు జామున మూడు గంటలకు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. అయితే రిమాండ్‌కు పంపే సెక్షన్‌లు లేనందున 41 A కింద నోటీసు ఇచ్చి పంపాలని పోలీసులకు న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోతిన మహేష్‌కు 41A కింద నోటీసు ఇచ్చి ఇంటికి పంపించారు.

Updated Date - 2022-09-03T13:26:50+05:30 IST