మైనార్టీల ద్రోహి Vellampalli: పోతిన వెంకట మహేష్

ABN , First Publish Date - 2022-05-06T19:38:12+05:30 IST

జనసేన నేత పోతిన వెంకట మహేష్ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

మైనార్టీల ద్రోహి Vellampalli: పోతిన వెంకట మహేష్

Vijayawada: జనసేన నేత పోతిన వెంకట మహేష్ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజకీయ స్వలాభం కోసమే వెల్లంపల్లి పని చేస్తారని ఆరోపించారు. పవిత్ర రంజాన్ రోజున తన నియోజకవర్గంలోనే  కాదు విజయవాడలో ఏ ఒక్క చోట ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనలేదని, ముస్లిం మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ మోసం చేస్తున్నారని విమర్శించారు. వెల్లంపల్లి మైనార్టీల ద్రోహి అని, అతని ఊసరవెల్లి నిజ స్వరూపం అందరూ గ్రహించాలన్నారు. ఈద్ నాడు అవినీతి ఆత్మలు (కోకో)2 సైతాన్ లా  తిరుగుతున్నాయని, తరిమికొట్టాలని ప్రజలకు పోతిన వెంకట మహేష్ పిలుపిచ్చారు.

Read more