విద్యకు పేదరికం అడ్డు కాకూడదు

ABN , First Publish Date - 2022-07-06T05:45:49+05:30 IST

విద్యకు పేదరికం అడ్డు కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యాకానుక ద్వారా విద్యా సామాగ్రిని అందించడం గొప్ప విషయమని కలెక్టర్‌ వి.విజయరామరాజు పేర్కొన్నారు. కడప నగరం మున్సిపల్‌ ఉర్దూ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం జగనన్న విద్యాకానుక కిట్లను పంపిణీ చేశారు.

విద్యకు పేదరికం అడ్డు కాకూడదు
జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వి.విజయరామరాజు

కలెక్టర్‌ వి.విజయరామరాజు 

కడప(ఎడ్యుకేషన్‌), జూలై 5: విద్యకు పేదరికం అడ్డు కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యాకానుక ద్వారా విద్యా సామాగ్రిని అందించడం గొప్ప విషయమని కలెక్టర్‌ వి.విజయరామరాజు పేర్కొన్నారు. కడప నగరం మున్సిపల్‌ ఉర్దూ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం జగనన్న విద్యాకానుక కిట్లను పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్‌తో పాటు జేసీ సాయికాంత్‌వర్మ, కడప నగర మేయర్‌ కె.సురేశ్‌బాబు, నగర కమిషనర్‌ జీఎస్‌ఎస్‌ ప్రవీణ్‌చంద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పేద విద్యార్థుల చదువుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించే బాధ్యత ప్రభుత్వా నిదని అయితే.. లక్ష్యం దిశగా విద్యను అభ్యసించే బాధ్యత విద్యార్థులదే అని సూచిం చారు. పిల్లల విద్యాభివృద్ధికి తల్లులే ప్రధానంగా బాధ్యత తీసుకోవాలన్నారు. సమగ్ర శిక్ష అభియాన్‌ పీవో డాక్టర్‌ ఎ.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫాం, బెల్టు, బూట్లు, 2 జతల సాక్సులు, స్కూల్‌ బ్యాగ్‌, పాఠ్య పుస్తకాలు, నోటు బుక్స్‌, వర్క్‌బుక్స్‌, ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీష్‌ డిక్షనరీలను కిట్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేసిందన్నారు. 2022-23 విద్యా సంవత్సరానికి గాను జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 1,81,001 మంది విద్యా ర్థులకు ప్రభుత్వం అందిస్తున్న విద్యాకానుక లబ్ధి చేకూరుతుందన్నారు. అనంతరం ప్రభుత్వం అందజేసిన 9 రకాల వస్తువులతో కూడిన జగనన్న విద్యాకానుక కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కడప నగర డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి, ఉన్నత విద్య ఆర్జేడీ మధుసూదన్‌రెడ్డి, డీఈవో నారాయణ, పాఠశాల ప్రధానో పాధ్యాయులు పుష్పలత పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-06T05:45:49+05:30 IST