ఏసీబీ వలలో విద్యుత్ ఏఈ

Oct 22 2021 @ 21:12PM

విశాఖ: కాంట్రాక్టర్ దగ్గరి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు విద్యుత్ ఏఈ దొరికిపోయాడు. రమణ అనే లేబర్ కాంట్రాక్టర్ దగ్గర నుంచి పెండింగ్‌లో ఉన్న బిల్లులు నిమిత్తం ఎపీఈపీడీసీఎల్ ఏఈ 2 లక్షలు డిమాండ్ చేసాడు. దీంతో ఏసీబీ అధికారులను కాంట్రాక్టర్ సంప్రదించాడు. అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో కాంట్రాక్టర్  నుంచి రెండు లక్షలు లంచం తీసుకుంటుండగా ఏఈని రెడ్ హేండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.