కరెంట్‌ బిల్‌ కట్టమంటే బెదిరింపు.. జైలు, జరిమానా

ABN , First Publish Date - 2021-03-04T11:58:15+05:30 IST

కరెంట్‌ బిల్లు చెల్లించమన్నందుకు కత్తితో బెదిరించిన వ్యక్తికి కోర్టు జైలు శిక్ష

కరెంట్‌ బిల్‌ కట్టమంటే బెదిరింపు.. జైలు, జరిమానా

హైదరాబాద్/నేరేడ్‌మెట్‌ : కరెంట్‌ బిల్లు చెల్లించమన్నందుకు కత్తితో బెదిరించిన వ్యక్తికి కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించిందని సీఐ నరసింహస్వామి తెలిపారు. నేరేడ్‌మెట్‌లో నివాసముండే శంకర్‌రాయ్‌ (59) దక్షిణ మధ్య రైల్యేలో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ఆయన ఇంటి కరెంట్‌ (మీటర్‌ నెం. 262114892) బిల్లు పెండింగ్‌ ఉంది.


విద్యుత్‌ బిల్‌ కలెక్టర్‌ శ్రీశైలం పెండింగ్‌ బిల్లు కట్టాలని, లేకుంటే కనెక్షన్‌ను తొలగిస్తామని శంకర్‌రాయ్‌కు 2018 సెప్టెంబర్‌ 29న చెప్పాడు. దీంతో కోపోద్రిక్తుడైన శంకర్‌రాయ్‌ కత్తితో పొడుస్తానని బిల్‌ కలెక్టర్‌ను బెదిరించాడు. బిల్‌ కలెక్టర్‌ నేరేడ్‌మెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు  కేసు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్‌ వేశారు. విచారణ జరిపిన మల్కాజిగిరి అడిషనల్‌ - 19 ఎంఎం కోర్టు జడ్జి బుధవారం శంకర్‌రాయ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ. 3 వేలు జరిమానా విధించారు.

Updated Date - 2021-03-04T11:58:15+05:30 IST