వాల్మీకిపురంలో ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్తు కట్‌

ABN , First Publish Date - 2022-01-29T06:05:15+05:30 IST

విద్యుత్తు బకాయిలు పేరుకు పోవడంతో వాల్మీకిపురం ప్రభుత్వ కార్యాలయాలకు సరఫరా బంద్‌ చేశారు.

వాల్మీకిపురంలో ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్తు కట్‌
విద్యుత్తు సరఫరా లేక రిజిస్ట్రార్‌ కార్యాలయం బయట ఇబ్బందులు పడుతున్న జనం

వాల్మీకిపురం, జనవరి 28: విద్యుత్తు బకాయిలు లక్షల్లో పేరుకున్నాయి. స్పందించిన అధికారులు మండలకేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకు సరఫరా బంద్‌ చేశారు. ప్రధానంగా తహసీల్దార్‌ కార్యాలయం తరుపు రూ.8.75 లక్షల విద్యుత్తు బకాయిలు రావాల్సి ఉంది. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం రూ.60వేలు, ఆర్‌డబ్ల్యూఎస్‌ రూ.35వేలు, వ్యవసాయ శాఖ రూ.25వేలు, హౌసింగ్‌ రూ.17వేలు, ఐసీడీఎస్‌ రూ.10వేలు బకాయిలు చెల్లించాల్సి ఉంది. విద్యుత్తు సరఫరా బంద్‌ అవడంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చిన జనం ఇబ్బందులు పడ్డారు. రెవెన్యూ కార్యాలయానికి వచ్చిన ప్రజలు విద్యుత్తు సరఫరా లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాసులు మాట్లాడుతూ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్‌ సరఫరా నిలిపి వేసినట్లు చెప్పారు. 

Updated Date - 2022-01-29T06:05:15+05:30 IST