కార్యకర్తల కృషి వల్లే అధికారం

ABN , First Publish Date - 2022-07-01T05:25:55+05:30 IST

కార్యకర్తల కృషివల్లే దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, తెలంగాణాలో కూడా అధికారంలోకి రావాలంటే ప్రతీ కార్యకర్త కృషి చేయాలని ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎంపీ తీరత్‌సింగ్‌ రావత్‌ అన్నారు.

కార్యకర్తల కృషి వల్లే అధికారం
మహబూబ్‌నగర్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం తీరత్‌సింగ్‌రావత్‌

- వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం దిశగా అడుగులు

- మహబూబ్‌నగర్‌లో ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి  తీరత్‌ సింగ్‌ రావత్‌

మహబూబ్‌నగర్‌ (క్లాక్‌టవర్‌), జూన్‌ 30: కార్యకర్తల కృషివల్లే దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, తెలంగాణాలో కూడా అధికారంలోకి రావాలంటే ప్రతీ కార్యకర్త  కృషి చేయాలని ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎంపీ తీరత్‌సింగ్‌ రావత్‌ అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన జిల్లాస్థాయి నాయకుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసిన  మాట్లాడారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రణాళిక ప్రకారం పనిచేస్తే అఽధికారం ఖాయమన్నారు. అంతకు ముందు ఆయన నేరుగా మాజీ పార్లమెంట్‌ సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాకుల బాలరాజు, పాండు రంగారెడ్డి, సురేందర్‌రెడ్డి, కృష్టవర్ధన్‌రెడ్డి తదితరులు ఆయనకు పుష్పగుచ్ఛం ఘనస్వాగంతం పలికారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, మాజీ మంత్రి పి. చంద్రశేఖర్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పద్మజారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి,  అంజయ్య. రామాంజనేయులు, చిన్న వీరయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, పోతుల రాజేందర్‌ రెడ్డి, రామకృష్ణ, రాజుగౌడ్‌, వెంకటయ్య పాల్గొన్నారు.

ప్రతీ ఇంటికి మోదీ పథకాలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల ఏళ్ల పాలనలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని, ఈ పథకాలు దేశంలోని ప్రతీ ఇంటికీ వెళ్లాయని ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎంపీ తీరత్‌సింగ్‌ రావత్‌ అన్నారు. గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో శక్తి కేంద్రం ఇన్‌చార్జీలు, మండల అధ్యక్షులతో సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. హన్వాడ మండలం అధ్యక్షుడు వెంకటయ్య ఆధ్వర్యంలో గొండ్యాల్‌ గ్రామానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు, నాయకులు బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామీణ ప్రాంత మహిళ ఆత్మగౌరవం పెంచే దిశగా టాయిలెట్స్‌ నిర్మాణం, ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన ద్వారా ప్రతీ ఒక్కరికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ, కొవిడ్‌ సమయంలో ఉచిత వ్యాక్సినేషన్‌ పంపిణీ చేశామన్నారు. ఈ నెల 3న నిర్వహించే బహిరంగ సభకు ప్రతీ భూత్‌ నుంచి కనీసం 30 నుంచి 50 మంది తరలివచ్చేటట్లు చర్యలు తీసుకోవాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా పాలమూరు మునిసిపాలిటీ పరిధిలోగల చిర్మల్‌ కుచ్చ తండాను సందర్శించి అక్కడున్న భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కిష్ట్యనాయక్‌ స్వగృహంలో గిరిజన మహిళలతో ఆయన సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పద్మజారెడ్డి, పడాకుల బాల్‌ రాజ్‌, శ్రీనివాస్‌ రెడ్డి, కిష్ట్య నాయక్‌, తదితరులు పాల్గొన్నారు. 

 ప్రపంచ దేశాలు నరేంద్రమోదీ వైపు చూస్తున్నాయి.

దేవరకద్ర : దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రపంచ దేశాలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వైపు చూస్తున్నాయని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్‌ షెట్టర్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బీజేపీ రాష్ట్ర నాయకుడు డోకూర్‌ పవన్‌కుమార్‌ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. వచ్చే నెల 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేసేందుకు జన సమీకరణ కోసం కర్ణాటక రాష్ట్రం నుంచి 10 మంది బీజేపీ నాయకులను నియమించినట్లు తెలిపారు. ప్రతీ గ్రామం, మండలం నుంచి వేలాది మంది, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమలో కర్ణాటక రాష్ట్రం బీదర్‌ జిల్లా ఉడా చైర్మన్‌ బాబువలీ, కిసాన్‌ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, జిల్లా ప్రఽధాన కార్యదర్శి నంబి రాజు, నాయకుడు యజ్ఞభూపాల్‌ రెడ్డి, రవీందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు కొండ అంజన్‌కుమార్‌రెడ్డి, నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి నరేష్‌కుమార్‌, దేవయ్య, ఉషన్న పాల్గొన్నారు.

  ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఖ్యాతిని చాటిన నరేంద్రమోదీ 

- గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌రూపానీ 

జడ్చర్ల : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రానుందని గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌రూపానీ అన్నారు. జడ్చర్ల పట్టణంలోని ప్రేమ్‌రంగా గార్డెన్స్‌లో గురువారం జడ్చర్ల నియోజకవర్గంలోని బీజేపీ పోలింగ్‌బూత్‌ అధ్యక్షులు, ఆపై స్థాయి కార్యకర్తలు, శక్తికేంద్రాల ఇన్‌చార్జీలతో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశప్రధానిగా గడిచిన ఎనిమిదేళ్లలో దేశాన్ని అభివృద్ధిలో ఎంతో ముందుకు తీసుకెళ్లారన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధ్దంగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బీజేపీ అధికారంలోకి వచ్చేలా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతీ కార్యకర్త, నాయకుడు సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు మధుసూదన్‌యాదవ్‌, రంగారెడ్డి, రాపోతుల శ్రీనివాస్‌గౌడ్‌, ప్రతాప్‌రెడ్డి, నాగరాజు, సాహితిరెడ్డి తదితరులున్నారు. 

క్షేత్రస్థాయిలో నేతలు

- నియోజకవర్గాలకు చేరుకున్న బీజేపీ జాతీయ నేతలు

మహబూబ్‌నగర్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి) : పాలమూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జీజేపీ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. తెలంగాణలో 2023లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ ప్రతీ కార్యకర్త కృషి చేయాలని వారు సూచిస్తున్నారు.  గురువారం ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గస్థాయి సమావేశాలు నిర్వహించారు.  నియోజకవర్గస్థాయిలో కీలక నేతలు లేకుండా సమావేశాలు నిర్వహించారు.  మహబూబ్‌నగర్‌కు ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం తీరథ్‌సింగ్‌ రావత్‌, దేవరకద్రకు కర్ణాటక మాజీ సీఎం జగదీష్‌ షెట్టార్‌, జడ్చర్లకు గుజారాత్‌ మాజీ సీఎం విజయ్‌రూపాని, నాగర్‌కర్నూల్‌ జిల్లాకు గుజరాత్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి నీతిన్‌భాయ్‌పటేల్‌, అచ్చంపేటకు  జమ్మూ కశ్మీర్‌ మాజీ ఉపముఖ్యమంత్రి నిర్మల్‌ కుమార్‌సింగ్‌,  కొల్లాపూర్‌కు  కేంద్ర మాజీ మంత్రి, తమిళనాడు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పొన్ను రాధాకృష్ణన్‌, జోగుళాంబ గద్వాలకు  కశ్మీర్‌ నేత, మాజీ కార్యదర్శి ఆశిష్‌ సూద్‌,  అలంపూర్‌కు బీహార్‌ ఎమ్మెల్యే ప్రేమ్‌కుమార్‌, వనపర్తికి బీజేపీ జాతీయ కోశాధికారి, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర మాజీ మంత్రి రాజేష్‌ అగర్వాల్‌  వచ్చారు.  పార్టీ జిల్లా పదాధికారులు వారికి స్వాగతం పలికి మధ్యాహ్నం తర్వాత నియోజకవర్గ స్థాయి సమీక్షలు మొదలు పెట్టారు. తొలుత శక్తి కేంద్రం, భూత్‌ స్థాయి, మండల, నియోజకవర్గ స్థాయి కమిటీలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎనిమిదేళ్లలో ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం చేసిన పథకాలను వివరించారు. ప్రతీ కార్యకర్త కేంద్రం అమలు చేస్తోన్న పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలను ఆకర్షించాలని కోరారు. తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరిగిందని, రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని వివరించారు. రాత్రికి నియోజకవర్గాల్లోని ఎస్సీ, ఎస్టీ కార్యకర్తల ఇళ్లలో ఈ నేతలకు విందు ఏర్పాటు చేశారు. రాత్రి భోజనాల అనంతరం దేవరకద్రకు వచ్చిన కర్ణాటక మాజీ సీఎంకు దేవరకద్ర నియోజకవర్గ నేత డోకూరు పవన్‌కుమార్‌ రెడ్డి ఇంట్లో, మహబూబ్‌నగర్‌కు వచ్చిన ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం తీరథ్‌సింగ్‌రావత్‌కు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి నివాసంలో, జడ్చర్లకు వచ్చిన గుజరాత్‌ సీఎం విజయ్‌రూపానికి ప్రైవేట్‌ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. 

 






Updated Date - 2022-07-01T05:25:55+05:30 IST