ఇక కోతల.. వాతలు

ABN , First Publish Date - 2021-10-10T05:30:00+05:30 IST

ఇప్పటివరకు చార్జీల వాతలతో అల్లాడుతున్న విద్యుత్‌ వినియో గదారులు ఇక కోతల వాతలకు కూడా సిద్ధమవ్వాల్సిన పరిస్థితు లు నెలకొంటున్నాయి.

ఇక కోతల.. వాతలు

తీవ్రమైన విద్యుత్‌ కొరత

పెరిగిపోతోన్న విద్యుత్‌ వినియోగం

వినియోగానికి అనుగుణంగా లేని సరఫరా 

గ్రామాల్లో ఇప్పటికే మూడు గంటలకుపైగా కోత

రెండు, మూడు రోజుల్లో జిల్లా కేంద్రంలోనూ పవర్‌ కట్‌


గుంటూరు, అక్టోబరు 10: ఇప్పటివరకు చార్జీల వాతలతో అల్లాడుతున్న విద్యుత్‌ వినియో గదారులు ఇక కోతల వాతలకు కూడా సిద్ధమవ్వాల్సిన పరిస్థితు లు నెలకొంటున్నాయి. రాష్ట్ర విభ జనకు ముందు నాటి రోజులు పునరావృతం కానున్నాయా.? అం టే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితు లు.. ట్రాన్స్‌కో అధికారుల వ్యాఖ్య లు అవును అంటున్నాయి. ఇప్ప టికే గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు మూడు గంటల పాటు అమలు చేస్తూ కోతలు విధిస్తున్నారు. ఇదే పరిస్థితి మరికొద్ది రోజుల్లోనే జిల్లా కేంద్రమైన గుంటూరు నగ రంలోనూ అమలు కానున్నట్లు వి ద్యుత్‌శాఖ వర్గాలే స్పష్టం చేస్తు న్నాయి. విద్యుత్‌ ఉత్పత్తికి బొగ్గు కొరతతో పాటు ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవటమే కో తలకు ప్రధాన కారణాలన్న వ్యా ఖ్యలు ఆ శాఖ అధికారుల నుంచే వినిపిస్తున్నాయి. మొత్తానికి వి ద్యుత్‌ కోతల బాధలు ప్రజలకు తప్పేలా లేదు. జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు 17.477 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం న మోదవుతుందని అధికారులు తెలిపారు. అయితే వినియోగానికి అనుగుణంగా విద్యుత్‌ సరఫరా ఉండటం లేదు. దాంతో విద్యుత్‌ కోతలు తప్పేలా లేవు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం సమయాల్లో మూడు గంటల పాటు విద్యుత్‌ కోతలు అమలు చేస్తున్నారు. అయినప్పటికీ విద్యు త్‌ వినియోగం, సరఫరాకు వ్య త్యాసం తీవ్రంగా పెరుగుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా సర ఫరా లేకపోవటంతో అధికారులు విద్యుత్‌ కోతలు అమలు చేయా ల్సినపరిస్థితులు నెలకొంటున్నారు.


గుంటూరు వాసులకు  అర్ధరాత్రి అవస్థలు

రెండు, మూడు రోజుల్లో గుంటూరు నగర పరిధిలోనూ గంట పాటు విద్యుత్‌ కోత విధిం చేలా ఇప్పటికే అధికారులకు మౌ ఖిక ఆదేశాలు అందినట్లు తెలి సింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల లోపు ఏదో ఒక సమయంలో ఒక గంట పా టు విద్యుత్‌ కోత అమలు చేయ నున్నట్లు ఓ అధికారి తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏసీలు వాడరాదని విద్యుత్‌ గుంటూరు సర్కిల్‌ ఆపరేషన్‌ ఎస్‌ఈ మురళీ మోహన్‌ ఒక ప్రకటనలో సూ చించారు. వినియోగదారుల సహ కారంతోనే విపత్కర పరిస్థితుల నుంచి విద్యుత్‌ వ్యవస్థను కాపాడటం సాధ్యమని ఆయన తెలిపారు.  


 

Updated Date - 2021-10-10T05:30:00+05:30 IST