సత్తాచాటిన షార్ట్‌ రేంజ్‌ మిసైల్‌

Published: Sat, 25 Jun 2022 03:12:27 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సత్తాచాటిన షార్ట్‌ రేంజ్‌ మిసైల్‌

బాలాసోర్‌ (ఒడిసా), జూన్‌ 24: భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. గగనతల ముప్పు నుంచి యుద్ధనౌకలను కాపాడుకునేందుకు అభివృద్ధి చేసిన వెర్టికల్‌ లాంచ్‌-షార్ట్‌ రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌ (వీఎల్‌-ఎస్‌ఆర్‌ఎ్‌సఏఎం) పరీక్ష విజయవంతమైంది. ఉపరితలం నుంచి గగనతలానికి (సర్ఫేస్‌ టు ఎయిర్‌) ప్రయోగించే ఈ క్షిపణిని శుక్రవారం విజయవంతంగా పరీక్షించినట్టు డీఆర్‌డీవో వెల్లడించింది. ఒడిసా చాందిపూర్‌ తీరంలోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ వద్ద ఒక ఓడపై నుంచి దీన్ని వెర్టికల్‌ పద్ధతిలో హైస్పీడ్‌ వైమానిక లక్ష్యంపైకి ఈ క్షిపణిని ప్రయోగించగా.. అది లక్ష్యాన్ని ఛేదించిందని డీఆర్‌డీవో వెల్లడించింది. డీఆర్‌డీవో, భారత నేవీ సంయుక్తంగా ఈ పరీక్షను నిర్వహించాయి. పరీక్ష విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.