హక్కుల సాధనకు మరో పోరాటానికి సిద్ధం కావాలి

ABN , First Publish Date - 2020-12-04T04:41:14+05:30 IST

న్యాయమైన హక్కుల సాధన కోసం మాదిగలు మరోపోరాటానికి సిద్ధం కావాలని ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర కోఆర్డినేషన్‌ కమిటీ చైర్మన్‌ యాతాకుల భాస్కర్‌ మాదిగ పిలుపునిచ్చారు.

హక్కుల సాధనకు మరో పోరాటానికి సిద్ధం కావాలి
మాట్లాడతున్న యాతాకుల భాస్కర్‌ మాదిగ

జనవరి15 నుంచి మాదిగ పల్లెబాట

ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర కో ఆర్డినేషన్‌ కమిటీ చైర్మన్‌ యాతాకుల భాస్కర్‌ మాదిగ

ఖమ్మంచర్చికాంపౌండ్‌, డిసెంబరు3:  న్యాయమైన హక్కుల సాధన కోసం మాదిగలు మరోపోరాటానికి సిద్ధం కావాలని ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర కోఆర్డినేషన్‌ కమిటీ చైర్మన్‌ యాతాకుల భాస్కర్‌ మాదిగ పిలుపునిచ్చారు. గురువారం ఎంఆర్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కొరిపల్లి శ్రీనివాస్‌మాదిగ అధ్యక్షతన నగరంలో జరుగుతున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిఽథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాతాకుల భాస్కర్‌మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని పేర్కొన్నారు. పాలకులు అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగల ఊసే ఎత్తడంలేదని ఆరోపించారు. మాదిగలకు అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలం చెందారన్నారు. మాదిగలకు రావాల్సిన హక్కులకోసం మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఆసన్నమైందని తెలిపారు. అందుకోసం మాదిగల రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, జనవరి15 నుంచి మాదిగ పల్లెబాట కార్యక్రమం ద్వారా గ్రామ గ్రామాన ఉద్యమాన్ని నిర్మిస్తామని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో ఎంఆర్‌పీఎస్‌ టీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కొరిపల్లి శ్రీనివాస్‌మాదిగతోపాటు రాష్ట్ర కో ఆర్డినేటర్లు దండు సురేందర్‌మాదిగ, రేగుంట సునిల్‌మాదిగ, కోర్‌కమిటీ సభ్యులు జన్ను కనకరాజు మాదిగ, ఎం.మల్లేష్‌, కె.భాస్కర్‌, సాంబయ్య, భాస్కర్‌, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి గద్దల కోటేశ్వరరావు మాదిగ, కొంగ సరోజన మాదిగ, ఎంఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు ప్రదీప్‌మాదిగ  పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T04:41:14+05:30 IST