Deepa: వేద నిలయాన్ని అమ్మే ప్రసక్తే లేదు!

ABN , First Publish Date - 2022-09-07T14:02:38+05:30 IST

పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయాన్ని అమ్మే ప్రసక్తేలేదని ఆమె మేనకోడలు దీపా(Deepa) స్పష్టం చేశారు. ఆ భవనాన్ని కొనుగోలు చేయడానికి

Deepa: వేద నిలయాన్ని అమ్మే ప్రసక్తే లేదు!

                                  - స్పష్టం చేసిన జయలలిత మేనకోడలు దీప


చెన్నై, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయాన్ని అమ్మే ప్రసక్తేలేదని ఆమె మేనకోడలు దీపా(Deepa) స్పష్టం చేశారు. ఆ భవనాన్ని కొనుగోలు చేయడానికి అన్నాడీఎంకే అసమ్మతివర్గం నాయకురాలు శశికళ ప్రత్యేకంగా ట్రస్టు ఏర్పాటు చేశారని సామాజిక ప్రసార మాధ్యమాల్లో వచ్చిన పుకార్లను ఆమె ఖండించారు. ఈ మేరకు దీప ఓ వీడియో విడుదల చేశారు. వేదా నిలయం(Veda Nilayam) తమ పూర్వీకుల ఆస్తి అని, తన బామ్మ సంధ్య మృతి తర్వాత జయలలిత ఆ నివాసానికి వారసురాలైందని, అక్కడే తన తల్లిదండ్రులు, గడిపేవారని దీప తెలిపారు.  జయలలిత రాజకీయ ప్రవేశం తర్వాత తాము అక్కడి నుంచి టి.నగర్‌ నివాసానికి మారామని, హైకోర్టు ఉత్తర్వు ప్రకారం జయకు తాను, తన సోదరుడు దీపక్‌ వారసులమని, ప్రస్తుతం వేద నిలయాన్ని సంరక్షించే బాధ్యతలను నిర్వర్తిస్తున్నామని వెల్లడించారు. వాస్తవాలు ఇలా ఉండగా ఆ ఇంటిని తాను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నానని, పలువురు తనను సంప్రదించారనే వార్తలు అవాస్తవాలనీ ఆమె స్పష్టం చేశారు.

Updated Date - 2022-09-07T14:02:38+05:30 IST