AP News: రాబోయే ఎన్నికలు ప్రజాస్వామ్యంగా జరుగుతాయా..?: ప్రభాకర్ చౌదరి

ABN , First Publish Date - 2022-09-05T17:31:15+05:30 IST

జగన్ పాలనలో ప్రతిపక్షాలు ఉనికిని కోల్పోయే విధంగా అరాచకాలు జరుగుతున్నాయని ప్రభాకర్ చౌదరి విమర్శించారు.

AP News: రాబోయే ఎన్నికలు ప్రజాస్వామ్యంగా జరుగుతాయా..?: ప్రభాకర్ చౌదరి

అనంతపురం (Anantapuram): ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) పాలనలో ప్రతిపక్షాలు ఉనికిని కోల్పోయే విధంగా అరాచకాలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి (Prabhakar Choudary) విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాల నాయకులను బెదిరించడం, భయపెట్టడమే పనిగా పెట్టుకున్నారని, గ్రామాల్లో ప్రతీ వ్యక్తి డేటాను వాలంటీర్‌ (Volunteer) తీసుకుని, వైసీపీకి అనుకూలంగా లేనివారికి ఓటర్ల లిస్టులో పేరు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికలు ప్రజాస్వామ్యంగా జరుగుతాయా? అనే అనుమానం వస్తోందన్నారు. ఓటర్ల జాబితాలో పేరు లేదని ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 6వ తేదీ నుంచి పది రోజుల పాటు ప్రత్యేకంగా ఓటర్ల జాబితా పరిశీలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని వైకుంఠం ప్రభాకర్ చౌదరి స్పష్టం చేశారు.

Updated Date - 2022-09-05T17:31:15+05:30 IST