జార్జియా షెడ్యూల్ పూర్తి చేసిన ప్రభాస్

Mar 17 2020 @ 15:04PM

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ త‌న 20వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారు. ఇటీవ‌ల జార్జియా ప్రారంభించిన ఈ సినిమా షెడ్యూల్ పూర్త‌య్యింది. ఈ విష‌యాన్ని డైరెక్ట‌ర్ రాధాకృష్ణ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ‘‘మ‌రో షెడ్యూల్ పూర్త‌య్యింది. ఈ షెడ్యూల్ ఇంత త‌ర్వ‌గా పూర్తి కావ‌డానికి జార్జియ‌న్ టీమ్ ఎంత‌గానో స‌పోర్ట్ చేసింది. త్వ‌ర‌లోనే మా సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేస్తాం’’ అన్నారు రాధాకృష్ణ‌. పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరిగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌భాస్ త‌ల్లి పాత్ర‌లో బాలీవుడ్ న‌టి భాగ్య‌శ్రీ న‌టిస్తుంది. గోపీకృష్ణా మూవీస్‌, యువీ క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 

Follow Us on:

ఓవర్సీస్ సినిమామరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.