ప్రభాస్‌–మారుతి: రాజా డీలక్స్‌?

Published: Sat, 22 Jan 2022 10:41:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ప్రభాస్‌–మారుతి: రాజా డీలక్స్‌?

ప్రభాస్‌ జెట్‌ స్పీడ్‌లో సినిమాలు అంగీకరిస్తున్నారు. ‘రాధేశ్యామ్‌’ను విడుదలకు సిద్ధం చేసిన ఆయన ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌కె’, ‘ఆదిపురుష్‌’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా మరో సినిమాకు ఆయన సైన్‌ చేయనున్నట్లు సమాచారం. మారుతి దర్శకత్వంలో ఓ బ్యూటిఫుల్‌ చిత్రం చేయనున్నారట. అయితే ఈ చిత్రానికి ప్రభాస్‌ అంగీకరించాల్సి ఉందట. ఆయన సై అంటే ప్రస్తుతం చేస్తున్న చిత్రాల గ్యాప్‌లో ఈ సినిమా పూర్తి చేస్తారని మారుతి సన్నిహితులు  చెబుతున్నారు. ప్రస్తుతం మారుతి కథ రాసే పనిలో ఉన్నారు. ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్‌’ అనే టైటిల్‌ అనుకుంటున్నారని సమాచారం. ఈ చిత్రానికి దానయ్య, నిరంజన్‌రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించనున్నారట. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International