
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'రాధేశ్యామ్'. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. సినిమాను చకచకా పూర్తి చేస్తున్న యూనిట్ కోసం ప్రభాస్ సర్ప్రైజ్ ఇచ్చాడట. ఇంతకూ ప్రభాస్ ఏం చేశాడో తెలుసా?..ఎంటైర్ యూనిట్‌కు ఖరీదైన రిస్ట్ వాచ్‌లను బహుమతిగా ఇచ్చాడట ప్రభాస్. మా ప్రభాస్ మనసు నిజంగా చాలా పెద్దది అని ప్రభాస్ ఇచ్చిన గిఫ్ట్ చూసి యూనిట్ సభ్యులు అనుకుంటున్నారట. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ పీరియాడికల్ లవ్‌స్టోరిలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. యు.వి.కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. శుక్రవారం ప్రభాస్ సలార్ షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కానుంది.