Advertisement

ప్రభాస్ ప్లాన్ అదేనా?

Dec 3 2020 @ 13:52PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పీడ్ పెంచాడు. వరుసగా సినిమాలు అంగీకరిస్తున్నాడు. ప్రస్తుతం `రాధేశ్యామ్` చేస్తున్న ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక భారీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌కు ఓకే చెప్పాడు. ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే మరో రెండు భారీ సినిమాలను ప్రకటించాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రూపొందించనున్న భారీ బడ్జెట్ సినిమా `ఆది పురుష్`లో నటించబోతున్నాడు. 


అలాగే కన్నడ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించబోయే `సలార్`కూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాశాడు. ఈ సినిమాలను ఎప్పటికి పూర్తి చేస్తాడనే చర్చ ప్రస్తుతం సాగుతోంది. ఇవన్నీ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న సినిమాలే. విశ్వసనీయ సమాచారం ప్రకారం నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే సినిమాను, `ఆదిపురుష్`ను ప్రభాస్ వచ్చే ఏడాదే పట్టాలెక్కిస్తాడట. `ఆదిపురుష్` షూటింగ్‌ను జనవరిలో ప్రారంభించి ఏప్రిల్‌కల్లా పూర్తి చేస్తాడట. ఈ సినిమా చిత్రీకరణంతా సెట్స్‌లో జరిగేదే కాబట్టి ప్రభాస్ మూడు నెలలు షూటింగ్‌లో పాల్గొంటే సరిపోతుందట. ఆ తర్వాత `ఆదిపురుష్` టీమ్ పోస్ట్-ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభిస్తుందట. ఇక, మే నుంచి నాగ్ అశ్విన్ సినిమా మొదలవుతుందట. ప్రభాస్-దీపిక సీన్లను సింగిల్ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తారట. షూటింగ్‌ను వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేసి 2022 వేసవిలో విడుదల చేయాలని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నాడట. 

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.