ఎన్‌సీసీ కేడెట్లకు ‘సి’ సర్టిఫికెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2021-04-23T05:31:56+05:30 IST

ఎన్‌సీసీ కేడెట్లకు ‘సి’ సర్టిఫికెట్‌ పరీక్షల్లో భాగం గా గురువారం ఏలూరు సీఆర్‌ఆర్‌ కళాశాల గ్రౌండ్స్‌లో ప్రాక్టికల్స్‌ నిర్వహించారు.

ఎన్‌సీసీ కేడెట్లకు ‘సి’ సర్టిఫికెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు
ఎన్‌సీసీ పరీక్షలు బ్యాటిల్‌ క్రాఫ్ట్‌, డ్రిల్‌ టెస్ట్‌

ఏలూరుఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 22 : ఎన్‌సీసీ కేడెట్లకు ‘సి’ సర్టిఫికెట్‌ పరీక్షల్లో భాగం గా గురువారం ఏలూరు సీఆర్‌ఆర్‌ కళాశాల గ్రౌండ్స్‌లో ప్రాక్టికల్స్‌ నిర్వహించారు. తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, భీమవరం, భీమడోలు, నరసాపురం, చింతల పూడిలోని 11 డిగ్రీ కళాశాలల నుంచి 197 మంది విద్యార్థులు హాజరయ్యారు. డ్రిల్‌ టెస్ట్‌, మ్యాప్‌ రీడింగ్‌, వెపన్‌ డ్రిల్‌, బ్యాటిల్‌ క్రాఫ్ట్‌, ఫీల్డ్‌ క్రాఫ్ట్‌ విభాగాల్లో కేడెట్ల సామర్ధ్యం పరీక్షించారు. 19 ఆంధ్రా బెటాలియన్‌ ఎన్‌సీసీ కమాండింగ్‌ ఆఫీసర్‌ కల్నల్‌ ఎ.కె.రాయ్‌ మాట్లాడుతూ ప్రాక్టికల్స్‌కు హాజరైన కేడెట్లకు ఈనెల 25న రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. కోవిడ్‌ ఉధృతి కారణంగా జిల్లా నుంచి హాజరయ్యే కేడట్లకు రాత పరీక్షను తొలిసారిగా సిఆర్‌ఆర్‌ కళాశాలలోనే పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నామన్నారు. ప్రాక్టికల్స్‌ నిర్వహణలో అన్సార్‌ మొహమ్మద్‌,  పి.ఎం.సెలిన్‌రోజ్‌, ఎం.నవీన్‌కుమార్‌, నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.



Updated Date - 2021-04-23T05:31:56+05:30 IST