
దేవుడి సృష్టి అయిన మొదటి మానవుడు చేసిన తప్పును సరిదిద్దడానికి, పాపకార్యాల్లో మునిగిపోయిన మానవాళికి సరైన మార్గం చూపించడానికి ఒక మానవునిగా... దైవ కుమారుడైన ఏసు క్రీస్తు భూమిమీద ఉదయించాడు. పతనానికి దారితీసే ప్రలోభాల్లో చిక్కుకోకూడదంటే... దేవుని ఆదేశాలను మానవులు పాటించాలి. దేవుని వాక్కు పట్ల అచంచలమైన విధేయత ఉండాలి. ఇవన్నీ ఏసు క్రీస్తు స్వయంగా పాటించాడు.
‘‘ఏసు క్రీస్తు భూలోకంలో ఉన్నప్పుడు తనను మరణం నుంచి కాపాడగలిగే దేవుడికి కన్నీళ్ళతో గట్టిగా అభ్యర్థనలు చేసుకున్నాడు. ఏసుకు దైవభయం ఉన్నది కాబట్టి ఆయన ప్రార్థనలను దైవం ఆలకించాడు. ఏసు దేవుని కుమారుడే. కానీ తాను పడిన కష్టాల ద్వారా విధేయతను అలవరచుకున్నాడు. తనకు లోబడి ఉండే వాళ్ళకు శాశ్వత రక్షణ అందించే అర్హతపొందాడు’’ అంటూ ‘హెబ్రీయులు’లో పేర్కొన్న వాక్యాలు దీనికి నిదర్శనాలు. దైవభయం, విధేయత, వినయంతో చేసుకొనే అభ్యర్థన... ఇవి దేవుని కృపకు పాత్రులను చేస్తాయని ఏసు తన ఆచరణ ద్వారా సందేశం ఇచ్చాడు.ఫ