ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలి

ABN , First Publish Date - 2022-06-29T07:05:19+05:30 IST

సనాతన సంప్రదాయాల ను పాటించి ప్రతీ వ్యక్తి దైవ, ఆధ్యాత్మికత చింతనను అలవర్చుకోవాల ని ఉద్బోధించారు.

ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలి
నల్లగొండలో అనేశ్వరమ్మ గుట్టను పరిశీలిస్తున్న జయేంద్ర సరస్వతి

కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి

నార్కట్‌పల్లి / నల్లగొండ, జూన 28: సనాతన సంప్రదాయాల ను పాటించి ప్రతీ వ్యక్తి దైవ, ఆధ్యాత్మికత చింతనను అలవర్చుకోవాల ని ఉద్బోధించారు. నార్కట్‌పల్లి మండలంలోని గోపలాయపల్లి శ్రీ వా రిజాల వేణుగోపాలస్వామి ఆలయాన్ని స్వామిజీ మంగళవారం సందర్శించారు. స్వామి వారికి దేవస్థానంపై ఉన్న వేద పాఠశాల విద్యార్థు లు, వేద పండితులు ఆలయ మర్యాదల మేరకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రధానాలయంతో పాటు ఉపాలయాలను సందర్శించి ప్ర త్యేక పూజలు చేశారు. గుట్టపై శిల్పశాస్త్ర కళాశాల ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలించారు. వేణుగోపాలస్వామి దేవస్థానం దివ్యక్షేత్రంగా విరాజిల్లాలని అభిలషించారు. గుట్ట కింద నిర్మించనున్న శంకరమఠానికి భూమిపూజ చేశారు. గుట్ట కింద శంకర మఠాన్ని, ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు విజయేంద్ర సరస్వతి ప్రకటించారు. అనంతరం నల్లగొండ ప ట్టణంలోని అనేశ్వరమ్మగుట్ట ప్రాంతానికి జయేంద్ర సరస్వతి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. నల్లగొండలో ఒక దివ్యక్షేత్రాన్ని ప్రారంభించేందుకు అనువైన స్థలాన్ని పరిశీలించినట్లు తెలుస్తుంది. కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన సైదిరెడ్డి, దేవస్థాన అనువంశిక ధర్మకర్త మోహనరెడ్డి, రాఘవశర్మ పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-29T07:05:19+05:30 IST