ప్రధాని మోదీ చేతిలో రిమోట్‌గా జగన్‌

ABN , First Publish Date - 2022-08-10T06:41:35+05:30 IST

ప్రధాని మోదీ చేతిలో రిమోట్‌గా జగన్‌

ప్రధాని మోదీ చేతిలో రిమోట్‌గా జగన్‌
కార్యక్రమంలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

గన్నవరం, ఆగస్టు 9 : రాష్ర్టాన్ని కార్పొరేట్‌ శక్తులకు ఽధారాదత్తం చేయడానికి జగన్‌ ప్రయ త్నిస్తున్నారని, ప్రధాని మోదీ చేతిలో రిమోట్‌గా మారారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస రావు ఆరోపించారు. ఇది ఆంధ్రరాష్ర్టానికి తీవ్రనష్టం కలిగిస్తుందని వాస్తవాన్ని జగన్‌ గమనిం చకుంటే  తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇంటింటికీ జాతీయ జెండా ఎగుర వేయాలని ప్రధాని మోదీ పిలుపు నివ్వటం దేశ ప్రజలను మరోసారి మోసం చేయటమే నన్నారు. స్థానిక రాయనగర్‌ క్లబ్‌లో సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ‘‘దేశ స్వాతంత్ర్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, మతతత్వ నిరంకుశత్వంపై పోరాటం చేద్దామంటూ చేపట్టిన ప్రచారోద్యమ సభ’’  మండల కార్యదర్శి మల్లంపల్లి ఆంజనేయులు అధ్యక్షతన మంగళవారం జరి గింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, 2002 సంవత్సరం వరకూ బీజేపీ జాతీయ జెండాను పట్టుకోలేదని, ఆ తరువాత దేశంలో ఎదగాలంటే  జెండాను పట్టుకోవాలనే ఆలోచనకు వచ్చి అప్పటి నుంచి జెండాను పొగడటం, పట్టుకోవటం చేశారని గుర్తు చేశారు. ఇంటింటిపైన జాతీయ జెండా ఎగురవేయాలని చెప్పే అర్హత మోదీకి లేదన్నారు. అది కమ్యూనిస్టులకు మాత్ర మే ఉందని స్పష్టం చేశారు. జాతీయ ఉద్యమంలో కమ్యూనిస్టులు కీలకపాత్ర పోషించారన్నారు. అందుకే జాతీయ జెండాను ఎగురవేసేందుకు ప్రచారోద్యమం చేపట్టామన్నారు. అదాని, అంబాని చేతుల్లో అధికారాన్ని లాక్కోవటం కోసం ప్రజా ఉద్యమాన్ని నిర్మించే పనిలో కమ్యూనిస్టులు ముం దుకు సాగుతున్నారని చెప్పారు.  ఈ  కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు, నాయకులు కళ్ళం వెంకటేశ్వరరావు, మల్లపల్లి జయమ్మ, అనుమోలు వెంకటేశ్వరరావు, అజ్మీర వెంకటేశ్వరరావు, బేత శ్రీనివాసరావు, సర్పంచ్‌లు బడుగు బాలమ్మ, తెల్లాకుల వెంకట రామ్మో హనరావు, సీపీఐ నాయకులు కాట్రగడ్డ జోషి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-10T06:41:35+05:30 IST