Advertisement

నటి ప్రగతితో పెట్టుకోవద్దురోయ్‌..

Nov 30 2020 @ 21:55PM

నటి ప్రగతి రఫ్ఫాడించేస్తోంది. ఈ లాక్‌డౌన్‌లో అందరినీ ఎంటర్‌టైన్‌ చేసిన వారిలో నటి ప్రగతి కూడా ఒకరు. ఆమె తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్‌ చేసిన డ్యాన్స్‌లు, ఎక్స్‌ర్‌సైజులు చేస్తున్న వీడియోలు ఏ విధంగా వైరల్‌ అయ్యాయో తెలిసిన విషయమే. అయితే ఇప్పటి వరకు ఎంటర్‌టైన్‌ చేస్తూ వచ్చిన ప్రగతి.. ఇప్పుడు సడెన్‌గా రఫ్ఫాడించేస్తోంది. అదెలా అనుకుంటున్నారా? అయితే ఈ కింది వీడియో చూడాల్సిందే. చూశారుగా.. కర్రసాముతో ప్రగతి ఎలా రెచ్చిపోయింది. అందుకే ఆమెతో చాలా జాగ్రత్త అని చెప్పేది. డ్యాన్స్‌, ఎక్స్‌ర్‌సైజులతో అలరించింది కదా.. అని దగ్గరకి వస్తే.. తాట తీస్తా.. అనే విధంగా ప్రొఫెషనల్‌లా కర్రసాముతో కుమ్మేస్తోంది. డోంట్‌ ట్రబుల్‌ ద ట్రబుల్‌ అంటూ ఆమె కర్రసాము చేస్తున్న వీడియో చూసిన వారంతా.. మరో రాములమ్మ వస్తుందిరోయ్‌.. ఆమెతో పెట్టుకోవద్దురోయ్‌.. అంటూ కామెంట్స్‌ చేస్తున్నారంటే ఏ రేంజ్‌లో ప్రగతి ఫైట్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు.

 


Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.