పోలవరంపై మంత్రి ప్రహ్లాద్ సింగ్ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-04-18T22:53:54+05:30 IST

పోలవరం ప్రాజెక్ట్‌కు అన్నివిధాలా కేంద్రం సహకారం ఉంటుందని.. ఈ విషయంలో కేంద్రం కేవలం థర్డ్ పార్టీనేనని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు.

పోలవరంపై మంత్రి ప్రహ్లాద్ సింగ్  కీలక వ్యాఖ్యలు

విశాఖ: పోలవరం ప్రాజెక్ట్‌కు అన్నివిధాలా కేంద్రం సహకారం  ఉంటుందని.. ఈ  విషయంలో కేంద్రం కేవలం థర్డ్ పార్టీనేనని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. సోమవారం మంత్రి ప్రహ్లాద్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ..  పోలవరం ప్రాజెక్టు 2013 -14లో అంచనాలకు కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. ప్రాజెక్ట్‌ అంచనా వ్యయం పెరగడంతో పెరిగిన అంచనాలపై కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత కేంద్రం పోలవరం ప్రాజెక్ట్‌పై  తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.13 వేలకోట్లు పైబడి కేంద్రం నిధులు జారీ చేసిందన్నారు. జలజీవన్ మిషన్‌కి రూ.60 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. జలజీవన్ మిషన్‌లో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం ఖర్చు ఉంటుందన్నారు.ఏపీలో 95 లక్షల ఇళ్లకు మంచినీళ్లు ఇవ్వాలని కేంద్రం లక్ష్యం పెట్టుకుందన్నారు.ఇప్పటికే 54 లక్షల ఇళ్లకు మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.2024 నాటికి ప్రతి ఇంటికీ జలజీవన్ మిషన్‌తో మంచినీరు సరఫరా చేస్తామని మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు.

Updated Date - 2022-04-18T22:53:54+05:30 IST