అశ్వవాహనంపై ప్రహ్లాదరాయలు

ABN , First Publish Date - 2022-08-16T05:49:24+05:30 IST

వేదపండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాల మధ్య మంత్రాలయంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు ఆశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

అశ్వవాహనంపై  ప్రహ్లాదరాయలు
అశ్వవాహనం పై దర్శనమిచ్చిన ప్రహ్లాదరాయలు

వైభవంగా సుజ్ఞానేంద్రతీర్థుల ఆరాధన 

 

మంత్రాలయం, ఆగస్టు 15: వేదపండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాల మధ్య మంత్రాలయంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు ఆశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సోమవారం రాఘవేంద్రస్వామి 351వ సప్తరాత్రోత్సవాల్లో భాగంగా 6వ రోజు మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ప్రత్యేక పూజలు  చేసి హారతులు ఇచ్చారు. కర్ణాటకలోని నంజలగూడలో వెలసిన సుజ్ఞానేంద్రతీర్థుల బృందావనాన్ని   శోభయానుమానంగా అలంకరించారు. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను  అశ్వవాహనంపై   ఊరేగించారు. అనంతరం ఊంజలసేవ చేసి చెక్క, వెండి, బంగారు, రజిత రథాలపై ఊరేగించారు. ఈ ఉత్సవాల్లో  వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పండిత కేసరి విద్వాన రాజా ఎస్‌ గిరిరాజాచార్‌, మఠం దివాన సుజీంద్రాచార్‌, ఆనంద తీర్థాచార్‌, గౌతమాచార్‌, శ్రీమఠం సలహాదారు శ్రీనివాస్‌ కస్బే, ఏఏవో మాధవశెట్టి, మఠం మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్‌ జోషి  పాల్గొన్నారు.  

ఆకట్టుకున్న భరతనాట్యం:  ఉత్సవాల్లో ఆరో రోజు సోమవారం రాత్రి  బెంగుళూరు చెందిన హాసిక, శ్రీహరిహరణ్‌ బృందం చేసి నృత్యం భక్తులను అలరించింది.   పీఠాధిపతి కనులారా తిలకించి కళాకారులను ఆశీర్వదించారు. 

   నేడు సప్తరాత్రోత్సవాలకు ముగింపు 

  మంత్రాలయం రాఘవేంద్రస్వామి 351వ సప్తరాత్రోత్సవాలు మంగళవారం ముగియనున్నాయి.  పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు సర్వసమర్పణోత్సవం చేసి ఉత్సవాలకు ముగింపు పలకనున్నారు. పంచ వాహనాలపై స్వామిని  ఊరేగించనున్నారు. పీఠాధిపతి బృందావనానికి మహామంగళహారతులు ఇచ్చి భక్తులను ఆశీర్వదిస్తారు.  యోగీంద్ర కళామండపంలో  సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.



Updated Date - 2022-08-16T05:49:24+05:30 IST