ప్రజా సమస్యలపై ఉద్యమించాలి

Published: Sat, 21 May 2022 01:24:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 ప్రజా సమస్యలపై ఉద్యమించాలి సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు

గన్నవరం, మే 20 : ప్రజా సమస్యలపై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. స్థాని క పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మహానాడు సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జు నుడు మాట్లాడుతూ, గన్నవరం నియోజక వర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన సమ న్వయ కమిటీ ప్రజా సమస్యలపై ఉద్యమిం చాలన్నారు. ప్రజలను, పార్టీ కార్యకర్తలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఈ నెల 22న పార్టీ నియోజకవర్గ కార్యాలయ ఆవరణలో సాయంత్రం 4 గంటలకు మినీ మహానాడు నిర్వహిస్తున్నామన్నారు.  పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. ఈ సమా వేశంలో కనపర్తి శ్రీనివాసరావు, ఆళ్ల గోపాలకృష్ణ, దొంతు చిన్నా, గుండపనేని ఉమా వరప్రసాద్‌, వేములపల్లి శ్రీనివాస రావు, మూల్పూరు సాయి కల్యాణి, గుజ్జ ర్లపూడి బాబూరావు పాల్గొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.