ఆగస్టు 15 తరువాత ఆమరణ నిరాహార దీక్ష చేపడతా: KA Paul

ABN , First Publish Date - 2022-07-16T18:24:54+05:30 IST

ఎనిమిదేళ్లుగా విభజన హామీలను కేంద్రం, ప్రధాని మోదీ అమలు చేయడం లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపడ్డారు.

ఆగస్టు 15 తరువాత ఆమరణ నిరాహార దీక్ష చేపడతా: KA Paul

న్యూఢిల్లీ: ఎనిమిదేళ్లుగా విభజన హామీలను కేంద్రం, ప్రధాని మోదీ (Modi) అమలు చేయడం లేదని  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) మండిపడ్డారు. విభజన హామీలు అమలు పరచడం కాలేదు కాబట్టి రాజ్ ఘాట్‌లో మౌన దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. 12 గంటల నుంచి మూడు గంటల వరకు మౌన దీక్ష చేస్తానన్నారు. జీవితంలో మొట్ట మొదటిసారిగా రాజ్ ఘాట్‌లో మూడు గంటల పాటు మౌన దీక్ష చేస్తున్నానని తెలిపారు. నాతోపాటు మూడు గంటల పాటు దీక్ష చేయలేని వారు మూడు నిముషాలైనా దీక్ష పాటించాలని సూచించారు. ఈరోజు 2 కోట్ల 10 లక్షల మంది తనతో పాటు ఉపవాసం ఉంటున్నారని ఆయన తెలిపారు.


విభజన హామీల అమలు కోసం వచ్చే బుధవారం ఉదయం జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడతానని వెల్లడించారు. విభజన హామీలు అమలు చేయకపోతే ఆగస్టు 15 తరువాత ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు. తెలుగు సత్తా చూపకపోతే విభజన హామీలు అమలు కావన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం లక్ష 65 వేల కోట్ల మేర బకాయలు ఉన్నాయని కేఏ పాల్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-16T18:24:54+05:30 IST